/rtv/media/media_files/2024/11/02/xc563cSWBy7CwyLJI5IR.jpg)
UPI Transactions: ఫోన్ పే(Phone Pe), గూగుల్ పే(Google Pay) వంటి యూపీఐ పేమెంట్స్(UPI Payments) వాడేవారికి షాకింగ్ న్యూస్. ఇండియాలో రిటైల్ ట్రాన్సాక్షన్, సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవి ఫిబ్రవరి 1 అంటే రేపటి(శనివారం) నుంచి అమలులోకి రానున్నారు. ఇకపై ఇండియాలో జరిగిగే ఆన్‌లైన్ చెల్లింపుల యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొద్దని నిర్ణయించుకున్నారు.
రేపటి నుంచి పేమెంట్స్ బంద్.!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీలో ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అవుతాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల @, #, $ వంటివి ఉపయోగించవద్దని రూల్ పాస్ చేసింది.
Also Read: Business: ఈ టాప్ 5 షేర్ల మీద పెట్టుబడి పెడితే...లాభాలు మీ వెంటే..
ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు. ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది. కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించని ఏదైనా యాప్‌తో UPIని ఉపయోగిస్తే, మీ పేమెంట్స్ రద్దు చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఐడీని 26 ఇంగ్లీష్ అక్షరాలు, 9 అంకెల మాత్రమే వాడాలి. దీంతో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్‌లకు సూచించింది. ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.. అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!