HMPV వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్క రోజే దాదాపుగా రూ.9 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు నష్టపోయారు. తొలి HMPV కేసు నమోదు కావడంతో వెంటనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అయితే నేడు స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. సెన్సెన్స్ 300 పాయింట్లతో ప్రారంభమై పెరుగుతూనే ఉంది.
ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!
లాభాల్లోనే ట్రేడింగ్..
నేడు Ongc షేర్ ధరలు పెరిగాయి. నిన్న ఒక్కో Ongc షేర్ ధర రూ.254.3 ఉండగా నేడు షేర్ ధర 3.46 శాతం పెరిగి రూ.263.1కి చేరుకుంది. ఓఎన్‌జీసీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి వంటి కంపెనీలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే...
ఆయిల్ మార్కెటింగ్ మేజర్ హాంకాంగ్ ఆధారిత బ్రోకరేజ్ CLSA నుంచి అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ షేర్లు పెరిగాయి. బ్రోకరేజ్ ONGC షేర్‌లను (ONGC Shares) గతంలో అవుట్‌పెర్ఫార్మ్ నుంచి హై కన్విక్షన్ అవుట్‌పెర్ఫార్మ్‌కి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో షేర్ ధరలు పెరిగాయి. దాదాపుగా 42 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
Oil and Natural Gas Corporation shares surged after the oil marketing major bagged an upgrade from Hong Kong-based brokerage CLSA.
— T@@$h! (@takshi2418) January 7, 2025
The brokerage upgraded ONGC shares to 'High Conviction Outperform' from 'Outperform' earlier, raising its price target to Rs 360 per share. This…
ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని!
సెన్సెక్స్ (Sensex) సూచీలో టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. కానీ జొమాటో, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రం ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో