Britan: బ్రిటన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని కీర్ స్టార్మర్ తిప్పికొట్టారు. తప్పుడు, అసత్య వార్తలను మస్క్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలోధ్వజమెత్తారు. Also Read: Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే! బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్మర్ ను ప్రభుత్వం నుంచి తప్పించి..కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు పై మండిపడ్డారు. 2008-13 మధ్య కాలంలో ఇంగ్లాండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో బాధితులకు స్టార్మర్ న్యాయం చేయలేదని ఆరోపించారు. Also Read: Redmi 14C 5G: సంక్రాంతి ఆఫర్.. రూ.10 వేలలోపే కిర్రాక్ 5జీ ఫోన్ విడుదల! తప్పుడు ప్రచారాన్ని.. తాజాగా ఏర్పాటైన నిరంకుశ ప్రభుత్వం నుంచి బ్రిటన్ ప్రజలకు అమెరికా విముక్తి కల్పించాలా? వద్దా అంటూ పేర్కొంటూ తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ ఓ పోల్ నిర్వహించారు.ఇందుకు లక్షల సంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే మస్క్ తీరును తప్పుపట్టిన ప్రధాని స్టార్మర్ ..ఆయన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. మరో వైపు ఇతర దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్ఖ్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోరే పేర్కొన్నారు. ఇందుకోసం మస్క్ తన సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకుంటున్నారని అన్నారు. ఆర్థిక వనరులు భారీ స్థాయిలో ఉన్న ఇలాంటి వ్యక్తి ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచి పరిణామం కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్య, మిత్రదేశాల మధ్య ఉండాల్సిన విధానం ఇది కాదన్నారు. Also Read: Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? Also Read: Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు!