మొత్తానికి హెచ్–1 బీ వీసాదారుల పంట పండే రోజులు వచ్చాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ తమ దేశాలకు వెళ్ళక్కర్లేదని యూఎస్ ఎంబసీ శుభవార్త చెప్పింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో ఉన్న భారతీయులకు ఇది సూపర్ డూపర్ న్యూస్ అయింది. భారత్‌కు రాకుండానే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ చేసుకునేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను ప్రకటించింది. హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎప్పటి నుంచి, ఏ నెల, తేదీ నుంచి అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.
అబ్బ పెద్ద సమస్య తప్పింది..
ఇది అమెరికాలో ఉన్న భారతీయులకు నిజంగా ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటివరకూ హెచ్–1 స్టాంపింగ్ అనేది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంది. అపాయింట్‌మెంట్ స్లాట్లు పొందితేనే హెచ్– 1 బీ వీసా రెన్యూవల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో హెచ్ – 1 బీ వీసాదారులకు స్లాట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఈ కొత్త రూల్ ద్వారా అమెరికాలోనే అన్నీ జరిగిపోతాయి కాబట్టి రెన్యువల్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది ఇక మీదట.
ఇది కూడా చదవండి: Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే!
భారతీయులే అధికం..
హెచ్– 1 బీ వీసా రెన్యూవల్ అంశంలో ఇప్పటికే అమెరికా పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. ఇక దీన్ని ఆచరణలో పెట్టడమే మిగిలింది. అమెరికాలో జారీ చేసే హెచ్– 1 బీ వీసాల్లో భారతీయులే అత్యధికంగా ఉంటున్నారు. ప్రతీ ఐదు హెచ్–1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ వీసాల మీద చాలా కంప్లైటంస్, కాంట్రవర్శీలు కూడా నడుస్తుంటాయి ఎప్పుడూ. ట్రంప్ వస్తే అక్రమ వలసలతో పాటూ వీసాల కుదింపు కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ట్రంప్‌తో పాటూ ఏర్పాటవ్వబోయే కొత్త ప్రభుత్వంలో సభ్యలైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి వారు హె–బీ వీసాలకు అనుకూలంగా ఉన్నారు. వీసాల తగ్గింఉ ఆలోచన వారికి లేదని తెలుస్తోంది. అయితే వీసాలు జారీ చేసేటప్పుడే కొంత రిస్ట్రిక్షన్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2023 లో భారత దేశం నుంచి 72.3 శాతం హెచ్–1బీ వసాలను 3.86 లక్షల మంది పొందారు. ఇక 2024లో ఇది మరికొంచెం పెరిగింది.
ఇది కూడా చదవండి: BIG Breaking : వదలని ఏసీబీ.. కేటీఆర్కు మళ్లీ నోటీసులు!