దాదాపు పదేళ్ళ అధికారానికి స్వస్తి చెప్పారు కెనడా ప్రధాని ట్రుడో. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతర్గత పోరు కారణంగా నిన్న తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన సొంత పార్టీ లిబరల్ నాయకత్వాన్ని కూడా వదులుకున్నారు. తన పార్టీ సభ్యులు, నేతల దగ్గర నుంచే ట్రుడోకు వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దానికి తోడు రీసెంట్‌గా కెనడా ఆర్ధిక మంత్రి ఫ్రీలాంగ్ కూడా రాజీనామా చేశారు. దానికి కారణం ట్రుడో అవలంబిస్తున్న విధానాలే అని ప్రకటించారు కూడా. దీని తరువాత అంతర్గతంగా ఆయన మీద ప్రెజర్ చాలా ఎక్కువైంది. దీంతో ట్రుడో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు తాను పోరాడవలసి వస్తే రానున్న ఎన్నికల్లో తాను ఉత్తమంగా పోరాడలేనని స్పష్టమైందని చెప్పారు. Also Read: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే... Also Read: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! వ్యతిరేకత ఉన్నప్పుడు కష్టం... రాజీనామా చేసిన తరువాత ట్రుడో మాట్లాడారు. గత పదేళ్ళుగా తాను కెనడా మధ్య తరగతి ప్రజల బాగు కోసమే పోరాడనని తెలిపారు. ప్రజల పోరాటపటిమ, సంకల్పం నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపేవని...దాని ఆధారంగానే తాను ప్రధానిగా సమర్ధవంతంగా పని చేయగలిగానని చెప్పారు. ప్రస్తుతం కెనడా చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కుంటోందని ట్రుడో అన్నారు. పార్లమెంట్ కొన్ని నెలలుగా స్తంభించి పోయింది. కెనడియన్ల అత్యుత్తమ ప్రయోజనాల కోసం తాను ఎంత పోరాడుతున్నప్పటికీ అది ముందుకు సాగడం లేదని వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన ప్రతీ పనిలో తనకు సహకారం అందించి తన కుటుంబ సభ్యులుతో అన్నీ చర్చించాకనే అనౌన్స్ చేశానని చెప్పారు. తన రాజీనామాతో వచ్చే ఎన్నికల్లో కెనడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చిందని అన్నారు. లిబరల్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత నేను నా పదవులకు రాజీనామా చేస్తానని ట్రుడో చెప్పారు. కెనడా చరిత్రలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో లిబరల్ పార్టీ ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ. తరువాత కాబోయే కొత్త ప్రధాని, లిబరల్ పార్టీ నాయకుడు వచ్చే ఎన్నికలకు పార్టీ విలువలను ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నానని ట్రుడో ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని చూడ్డానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. వరుసగా తమ పార్టీ ప్రభుత్వాన్ని మూడు సార్లు ఏర్పాటు చేసిందని..కోవిడ్ సమయంలో ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఎంతో కృషి చేసిందని అన్నారు. ఇప్పుడు తరువాత వచ్చే నేతలు కూడా చేయాల్సిందిదేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. Also Read: Rat Hole: 18 మందిని మింగిన 'ర్యాట్ హోల్'.. 300 అడుగుల లోతులో! Also Read: Amit shah: మాటిస్తున్నా.. ఏఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా!