గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. నేడు బంగారం రూ.421 పెరిగి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,990గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,100గా ఉంది. ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే! ఇదిలా ఉండగా ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారం ధర దాదాపుగా రూ.90 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితల వల్ల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం కొనే ఛాన్స్‌లు ఉన్నాయట. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు క్లియర్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. గతేడాది బంగారం ధరలు దాదాపు 23 శాతం పెరగ్గా, వెండి ధరలు 30 శాతం పెరిగాయి. ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,560ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.77,710హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,560ముంబైలో 10 గ్రాముల ధర రూ.77,560కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.77,560 ఇది కూడా చూడండి: RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 10 గ్రాముల ధర రూ.71,100ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.71,250హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.71,100ముంబైలో 10 గ్రాముల ధర రూ.71,100కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.71,110 ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన