AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర దేవాదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 70 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. 2025 జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

New Update
AP Jobs

ap jobs

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర దేవాదాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 70 ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 జనవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఖాళీల సంఖ్య : 70

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 5 పోస్టులు 
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) : 30 పోస్టులు ఉన్నాయి. 

విద్యార్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత ఉండాలి. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.  

ఎంపిక ప్రక్రియ : ఎగ్జామ్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: జనవరి 5, 2025

వేతనం: ఏఈఈ పోస్టులకు నెలకు రూ.35,000 చెల్లిస్తారు. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.25,000 చెల్లిస్తారు. దీంతో పాటు అదనపు అలవెన్సులు చెల్లించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు