Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి బోర్‌ కొట్టకుండా ఎయిర్‌ ఇండియా నూతన సంవత్సర కానుకగా ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇక నుంచి కొన్ని విమానాల్లో వైఫైని అందించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

New Update
Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

Air India:ఎక్కువగా విమానాల్లో ప్రయాణించే వారు కిటికీల్లోంచి బయటకు చూడడంపై ఆసక్తి తగ్గినట్లు కనపడుతుంది. అలా అని ఓ కునుకేద్దామా అంటే చాలా మందికి అంత త్వరగా నిద్ర రాదు.కనీసం ఫోన్ వాడుకుందామనుకన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సిగ్నల్స్ రావు. ఇలా చాలా సమస్యలు విమాన ప్రయాణంలో ఎదురవుతాయనే విషయం తెలిసిందే.

Also Read: Lucknow Murder: నా తల్లి, 4గురు చెల్లెళ్లను అందుకే చంపేశా: వీడియో రిలీజ్ చేసిన కొడుకు!

కానీ ఎయిర్ ఇండియా సంస్థ ఈ సమస్యలకు ఓ పరిష్కారం చూపబోతుంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్లో వైఫై అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రయాణికులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దమవతుంది. టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: AP Jobs: నిరుద్యోగులకు చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీ నోటిఫికేషన్స్

నూతన సంవత్సరం సందర్భంగా పలు విమానాల్లో ఈ సేవలను ప్రారంభించి.. ప్రయాణికులను ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9, A321neo విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇలా దేశీయ విమానాల్లో వైఫై అందించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Beta Babies: మారిపోయిన జనరేషన్.. ఇకనుంచి పుట్టేవాళ్లందరూ బీటా బేబీస్

బ్రౌజింగ్, చాటింగ్ తో పాటు..

వైఫై సేవలను ఉపయోగించుకుంటూ ప్రయాణికులు ఏమైనా బ్రౌజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకోవడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లతో పాటు టాబ్లెట్లు, ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అన్నింటికీ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఈ సందర్భంగా ప్రకటించింది. అయితే ఇందుకు ఓ షరతు కూడా పెట్టింది. ముఖ్యంగా 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణికులు అందరూ వైఫైని కనెస్ట్ చేసుకోవచ్చంట.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ కేసులో తెలంగాణ సర్కార్‌కు బిగ్‌షాక్!

ప్రయాణికుల ఇష్టాలకు తగ్గట్లుగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామని.. ప్రతీ ఒక్క ప్రయాణికుడు వైఫై ఉపయోగించుకుని ప్రయాణ సమయంలో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా చెప్పారు అంతర్జాతీయ సేవల్లో వైఫ్ అందిస్తున్న ఎయిర్ బస్ A350 పైలెట్ ప్రాజెక్టు మాదిరిగానే దేశీయంగా కూడా సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 అంతేకాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ సహా అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్న ఎయిర్ బస్ A321neo, బోయింగ్ B787-9 విమానాల్లో కూడా వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు