ఒకరోజు లాభాలు సాధిస్తే...పది రోజులు నష్టాలు అన్నట్టు ఉంది ఈ మధ్యన స్టాక్ మార్కెట్ పరిస్థితి. ఎప్పుడు లాభాల్లోకి వస్తుందా అని మదుపర్లు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఈరోజు కూడా రోజంతా అప్ డౌన్ అవుతూనే ఉంది మార్కెట్. కానీ చివరకు మాత్రం లాభాల్లో ముగించింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు సూచీలు పైకి వెళ్ళడానికి కలిసి వచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మార్కెట్లకు కలిసి వచ్చింది.
Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల.
పుంజుకున్న అదానీ షేర్లు..
సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 80,234 వద్ద ముగిసింది. నిఫ్టీలోనూ 80 పాయింట్ల మేర పెరిగింది. 24,274 వద్ద ముగిసింది. ఈరోజు సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 లాభపడగా, 14 పతనమయ్యాయి. ఆటో, ఐటీ, ఎనర్జీ షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 84.44గా ఉంది. మరోవైపు ఈరోజు నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈరోజు రూ.248.50 (11.56%) పెరిగి రూ.2,399 వద్ద ముగిసింది. తమ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై ఆ గ్రూప్ వివరణ ఇవ్వడం వలనే అదానీ గ్రూప్ దాదాపు అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం చొప్పున లాభపడగా.. అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 10 శాతం చొప్పున రాణించాయి. మిగిలిన షేర్లూ ఓ మోస్తరుగా లాభపడ్డాయి.
Also Read: వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం?
Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత
Also Read: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. డిప్యూటీ సీఎం సంచలన ప్రెస్ మీట్!