Fire Accident: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల..

హైదరాబాద్‌లో మూడు చోట్ల ఒకే రోజు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాలకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
11

హైదరాబాద్‌లోని మణికొండలోని పుప్పాలగూడలో ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్ 9వ అంతస్తులో మూడు రోజుల కిందట గృహప్రవేశం జరిగింది. ఇంట్లో పెట్టిన దీపం కింద పడటంతో ఇళ్లంతా మంటలు అంటుకున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

ప్లాస్టిక్ ముడి సరకు ఉండటంతో..

ఇదిలా ఉండగా జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాలిథిన్ సంచులు తయారు అయ్యే ఎస్‌ఎస్‌వి ఫ్యాబ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కింత అంతస్తులో ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్‌కి చెందిన ముడి సరకు ఉండటంతో మంటలు వ్యాపించాయి.

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్లాస్టిక్ ముడి సరకు ఉండటంతో నాలుగు అంతస్తుల భవనం మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా మరణించారా? గాయపడ్డారా? వంటి పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

మరోవైపు రామంతపూర్‌లో వివేక్ నగర్‌లో కూడా ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున 3.30 సమయంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. స్ధానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు