Hero HF Deluxe Pro: ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా హీరో HF డీలక్స్ ప్రో రిలీజ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.73,550గా ఉంది. ఈ బైక్‌ 97.2cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. i3S సరికొత్త టెక్నాలజీ అందించారు. లీటర్ పెట్రోల్‌కు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

New Update
Hero HF Deluxe Pro

Hero HF Deluxe Pro

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత మార్కెట్‌లోకి మరొక అదిరిపోయే మోడల్‌ను తీసుకొచ్చింది. తమ ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో సరికొత్త హీరో HF డీలక్స్ ప్రో (Hero HF Deluxe Pro) బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధర రూ.73,550గా (Hero HF Deluxe Pro price) కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త మోడల్ స్టైలిష్ లుక్‌తో పాటు, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ Hero HF Deluxe Pro ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారుల డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

కొత్త బైక్ లాంచ్ చేసిన హీరో

ఈ కొత్త Hero HF Deluxe Pro బైక్‌ 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8000 RPM వద్ద 7.9 bhp శక్తిని, 6000 RPM వద్ద 8.05 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో కిక్, సెల్ఫ్ స్టార్ట్ (Self Start) ఆప్షన్స్ అందించారు. ఈ బైక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (Fuel Injection - Fi) టెక్నాలజీతో వస్తుంది. 

లీటర్‌కు 70 కి.మీ మైలేజ్

ఈ బైక్ ఇంటిగ్రేటెడ్‌లో ఫ్యూయల్ ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్‌ను అందించారు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా i3S టెక్నాలజీ (i3S Technology) (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) అందించారు. ఇది ట్రాఫిక్ జామ్‌లలో ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆపి.. ఇంధనాన్ని ఆదా చేస్తుంది. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

ఇకపోతే కంపెనీ ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌ను అందిస్తుండటం విశేషం.  అలాగే ఇందులో రైడింగ్ డేటా, ఫ్యూయల్ ఇండికేటర్ ను చూపే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. మెరుగైన భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. డేటైమ్ రన్నింగ్ లైట్లు, వెనుక భాగంలో LED టెయిల్ లైట్, ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్, 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇందులో అందించారు. 

Advertisment
తాజా కథనాలు