/rtv/media/media_files/2025/07/31/upi-payments-app-2025-07-31-08-30-11.jpg)
UPI Payments App New Rules
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్. ఫోన్ పే, గూగుల్ పే పేటీఎం వంటి UPI యాప్‌లు వాడే వారు రేపటి (ఆగస్ట్ 1) నుంచి మారనున్న కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే. ఆగస్టు 1 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల నిబంధనలలో భారీ మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చిన ఈ మార్పులు UPI వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, సర్వర్‌లపై భారాన్ని తగ్గించడం, లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. Google Pay, PhonePe, Paytm వంటి అన్ని UPI యాప్‌లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
Also Read : August 2025 New Rule: ఆగస్టు 1 నుండి UPI, క్రెడిట్ కార్డ్, LPG ధరలలో మార్పులు..!
UPI Payments App New Rules
🚨 [PART 2/2] New UPI rules from August 1.
— Fortune India (@FortuneIndia) July 30, 2025
NPCI is rolling out key changes to make digital payments safer and smoother. From daily balance check limits to fixed autopay slots and anti-fraud tweaks—here’s what you need to know.
For more news & updates, visit… pic.twitter.com/noQsOCnZym
ప్రధాన మార్పులు ఇవే:
రోజుకు 50 సార్లే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు : ఇకపై వినియోగదారులు ఒక UPI యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయగలరు. అంతకు ముందు ఇలాంటి లిమిట్ లేదు. పీక్ అవర్స్‌లో (ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1, సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 వరకు) బ్యాలెన్స్ చెక్ అభ్యర్థనలను పరిమితం చేసే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా డబ్బులు కొడితే.. లావాదేవీ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ అటోమెటిక్‌గా తెలియజేస్తుంది.
అకౌంట్ చూసే లిమిట్: ఒక UPI యాప్‌లో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇది సిస్టమ్‌పై అనవసరమైన లోడ్‌ను తగ్గిస్తుంది.
ఆటోపే సమయ మార్పులు: EMIలు, సబ్‌స్క్రిప్షన్‌లు వంటి ఆటోపే లావాదేవీలు ఇకపై నిర్దిష్ట సమయాలలో మాత్రమే జరుగుతాయి. పీక్ అవర్స్‌లో సర్వర్‌లపై ఒత్తిడిని తగ్గించడానికి, ఈ ఆటోపే లావాదేవీలు ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల మధ్య, మరియు రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఒక ఆటోపే మ్యాండేట్‌కు గరిష్టంగా నాలుగు ప్రయత్నాలు (ఒక ప్రారంభ ప్రయత్నం, మూడు రీట్రైలు) మాత్రమే అనుమతించబడతాయి.
పెండింగ్ పేమెంట్స్ స్టేటస్ చెక్: పెండింగ్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేటస్ 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. వాటి మధ్య 90 సెకన్ల విరామం తప్పనిసరి.
వాడని UPI IDల డీయాక్టివేషన్: 12 నెలలకు పైగా వాడకుండా ఉన్న మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన UPI IDలు వాటంతట అవే డీయాక్టివేట్ చేయబడతాయి.
ఈ మార్పులు సాధారణ UPI యూజర్లకు పెద్దగా ఇబ్బంది కలిగించవు, కానీ సిస్టమ్ స్థిరత్వం, వేగం, భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. సాధారణ పేమెంట్‌లు, డబ్బు బదిలీలకు సంబంధించిన పరిమితులలో ఎలాంటి మార్పు లేదు.
Also Read : UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో
upi-payments | upi-transaction-limits | UPI Transactions | new-rules | phone-pay | google-pay | online-transactions | latest-telugu-news