Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

New Update
ETFs

ETFs

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నేడు సిల్వర్ ధరలు(silver rates) భారీగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా వెండి ధరలు పెరుగుతుండగా.. నేడు ఈ ధరలకు బ్రేక్ పడింది. మార్కెట్‌లో నేడు కిలో వెండిపై రూ.5,756 వరకు తగ్గింది. దీంతో రూ.2,56,864గా ఉంది. అయితే గత నెల జనవరి 29న గరిష్ట స్థాయి రూ.4,20,048 వద్ద ఉన్న వెండి.. అక్కడి నుండి ఇప్పటివరకు సుమారు రూ.1.63 లక్షలు తగ్గింది. దీంతో వెండి ఈటీఎఫ్‌(silver-etf) లు రెడ్ జోన్‌లో ఉన్నాయి. వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి. టాటా సిల్వర్ ఎక్స్ఛేంజ్ ఫండ్, నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సి, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోటక్ సిల్వర్ ఈటీఎఫ్‌లు వీటన్నింటి ధరలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీగా తగ్గాయి. వెండి ధరలు ఒక్కసారి తగ్గడంతో ఈ ఫండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

 ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

లాభాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌

వెండి ధర(silver-rates-today) లతో పాటు బంగారం ధరలు(Gold Rates) కూడా తగ్గాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధరపై రూ.2,065 తగ్గి రూ.1,56,001కి చేరింది. అయితే బంగారం ధరలు తగ్గినప్పటికీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై దాని ప్రభావం తక్కువగా ఉంది. చాలా కంపెనీల గోల్డ్ ఈటీఎఫ్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వెండితో పోలిస్తే బంగారం ఈటీఎఫ్‌లు లాభాల్లోనే ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు