/rtv/media/media_files/2026/02/09/supreme-court-directs-extension-of-west-bengal-sir-deadline-2026-02-09-21-40-02.jpg)
Supreme Court Directs Extension Of West Bengal SIR Deadline
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సోమవారం సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందులో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర సర్కార్కు స్పష్టం చేసింది. మరోవైపు క్షేత్రస్థాయి అధికారుల భద్రత, పారదర్శకతపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన ముగించి ఫిబ్రవరి 14న తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది.
కానీ పత్రాల పరిశీలన కోసం మరింత సమయం అవసరమని గుర్తించిన కోర్టు.. ఈ గడువును ఫిబ్రవరి 14 నుంచి మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆదేశించింది. దీంతో బాధితులు తమ అభ్యంతరాలను నిరూపించుకునేందుకు తగిన సమయం దొరుకుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే ఎన్నికల సంఘం విధులకు సహకరించేందుకు వీలుగా 8,555 మంది గ్రూప్- బీ అధికారులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు ఓటర్ల తొలగింపు లేదా మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (ERO) మాత్రమే ఉంటుందని పేర్కొంది. మైక్రో అబ్జర్వర్లు వాళ్లకి కేవలం సహాయకారిగా మాత్రమే ఉండాలని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు SIR ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఫారమ్-7 దరఖాస్తులను ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అధికారులపై దాడులను అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఎప్స్టీన్ ఫైల్స్లో రష్యా అధ్యక్షుడు.. వెయ్యి సార్లు పుతిన్ పేరు ప్రస్తావన
మరోవైపు SIRకు సంబంధించి కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా హాజరై తన వాదనలను వినిపించారు. చిన్న చిన్న తప్పులతోనే లక్షలాది మంది ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ప్రతి ఒక్క అర్హత గల పౌరుడికి ఓటు హక్కు ఉండాలన్నారు. ఏ ఒక్కరినీ కూడా అన్యాయంగా తొలగించకూడదని ఈసీకి సూచించారు.
Follow Us