Malreddy Ranga Reddy : రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి కులమే అడ్డయితే తను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన స్థానంలో మరోక సామాజికవర్గానికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని అధిష్టానానికి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పిన మల్ రెడ్డి రంగారెడ్డి ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని ప్రకటించారు.
రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని చెప్పారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి.. ఎవరినైనా గెలిపిస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని కోరారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలని. కానీ, పదవులు కాదన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టడం సరికాదని చెప్పారు.
కాగా, గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారమూ సాగింది. అయితే, అనూహ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి అప్రమత్తమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి కులమే అడ్డయితే తను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను అంటూ వ్యాఖ్యానించారు.
Malreddy Rangareddy