Karnataka: కర్ణాటక డీజీపీ సెక్స్ స్కాండల్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు!

కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ కె. రామచంద్రరావుకు సంబంధించి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన తన అధికారిక కార్యాలయంలో, యూనిఫాంలో ఉన్న సమయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా..

New Update
Karnataka DGP Ramachandra Rao Claims Viral Video Is 'Morphed' Amid Smuggling Case Links

Karnataka DGP Ramachandra Rao Claims Viral Video Is 'Morphed' Amid Smuggling Case Links

కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ కె. రామచంద్రరావు(Karnataka DGP Ramachandra Rao) కు సంబంధించి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన తన అధికారిక కార్యాలయంలో, యూనిఫాంలో ఉన్న సమయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా(sex-scandal) ఉన్న దృశ్యాలు బయటపడ్డాయి.  ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే డీజీపీ రామచంద్రరావు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ వీడియోలను మార్ఫించ్ చేశారంటూ పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన కూతురు కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు వివాదాల్లో కూడా రామచంద్రరావు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 

Also Read :  భార్యకు విడాకులివ్వబోతున్న అఖిలేష్ యాదవ్ సోదరుడు.. మా కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఆరోపణలు

Karnataka DGP Ramachandra Rao Sex Scandal Video

Also Read :  ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఇదిలాఉండగా గతేడాది కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె.. తన తండ్రి డీజీపీ రామచంద్రరావు అధికారిక హోదాను, ప్రోటోకాల్‌ను వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు తీవ్ర  దుమారం రేపింది. అయితే ఇందులో తన పాత్రేమి లేదని, తనకు ఏమీ తెలియదని రామచంద్రరావు చెప్పినప్పటికీ.. ప్రోటోకాల్ దుర్వినియోగంపై అనుమానంతో కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని తప్పనిసరి సెలవుపై పంపింది.

చివరికి ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత.. ఆగస్టు2025లో  రామచంద్రరావుకు ఊరట లభించింది. ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసి, సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీపీగా తిరిగి నియామకం చేసింది. ఇక ఈ కేసులో స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు రన్యా రావుకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.