/rtv/media/media_files/2026/01/19/delhi-high-court-2026-01-19-17-33-53.jpg)
Delhi High Court dismisses Sengar’s plea to suspend sentence in death case of survivor’s father
ఉన్నావ్ అత్యాచార(Unnao rape) బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్(Kuldeep Singh Sengar) కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో తనకు విధించిన 10 ఏళ్ల శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ శిక్ష వ్యవహారంలో కుల్దీప్‌కు ఊరట కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ వెల్లడించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
Also Read: కర్ణాటక డీజీపీ సెక్స్ స్కాండల్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు!
Delhi High Court Dismisses Sengar’s Plea To Suspend
ఇటీవల కుల్దీప్ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు(delhi-high-court) ఆదేశాలు జారీ చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌లో వేశారు. ఈ నేపథ్యంలోనే శిక్ష నిలిపివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కస్టడీ నుంచి విడుదల చేయకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. తాజాగా ఢిల్లీ కోర్టు కూడా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: భార్యకు విడాకులివ్వబోతున్న అఖిలేష్ యాదవ్ సోదరుడు.. మా కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఆరోపణలు
ఇదిలాఉండగా 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కిడ్నాప్ చేసి, రేప్ చేశాడు. ఆ తర్వాత 2018లో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. 2019, ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను యూపీలోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఈ కేసులో కుల్దీప్‌కు అత్యాచారం కేసులో జీవిత ఖైదు, బాధితురాలి తండ్రి మృతి కేసులో పదేళ్ల పాటు జైలు శిక్ష పడింది. ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అప్పట్లోనే బీజేపీ కుల్దీప్‌ను బహిష్కరించింది.
Follow Us