New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

author-image
By Manogna Alamuru
New Update
Jio Cheapest Recharge Plan

Jio Cheapest Recharge Plan

కొత్త ప్లాన్, ఆఫర్లను అందించడంలో జియో(jio) ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు వినియోగదారులకు చేరువగా ఉండేలా చూసుకోవడంలో జియోను మించిన వారు లేరు. ఒకవైపు మిగతా కారియర్లు తమ రేటలను పెంచుకుంటూ పోతున్న తరుణంలో జియో మాత్రం ఆఫర్ల((offers) తో ముంచెత్తుతోంది. తాజాగా న్యూ ఇయర్ లో వినియోగదారులను సరికొత్తగా పలకరించేందుకు రిలయెన్స్ జియో సిద్ధమైంది. హ్యాపీ న్యూ ఇయర్ 2026(Happy New Year 2026) పేరుతో మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అవే కాకుండా రూ. 35 వేల విలువైన గూగుల్ జెమినీ(google-gemini-ai) ని ఉచితంగా ఇవ్వనుంది.  జియో తీసుకువచ్చిన మూడు ప్లాన్ లు ఇలా ఉండనున్నాయి. 

Also Read :  వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

హీరో యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్..

ఏడాది మొత్తానికి ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వారి కోసం ఈ ప్లాన్. దీని ధర రూ.3599. 365 వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ 18 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది. సుమారు రూ.35,100 విలువైన ఈ యాక్సెస్ ఉచితంగా ఇస్తోంది.

సూపర్ సెలబ్రేషన్ మంత్రీ ప్లాన్..

నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ ప్లాన్. దీని ధర రూ.500. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్లాన్ లో మెయిన్ అట్రాక్షన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. యూట్యూబ్ ప్రీమియ, జియో హాట్ స్టార్, అమెజాన్ పీవీఎంఈ, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫాన్ కోడ్, హోయ్ చాయ్ వంటి ఓటీటీలు అన్నీ ఫ్రీగా చూడవచ్చును. అలాగే వీరికి కూడా 18 నెలల పాటూ గూగుల్ జెమినీ ఏఐ ప్రోను ఉచితంగా ఇస్తున్నారు. 

Also Read :  భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

ఫ్లెక్సీ ప్యాక్..

నెలకొకసారి రీఛార్జ్ చేసుకుంటాం..కానీ ఎక్కువ ధర పెట్టము అనేవాళ్ళ కోసం ఈ ప్లాన్. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉండనుంది. అయితే ధర మాత్రం రూ.103లే. ఇందులో 5జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా హిందీ ప్యాక్, ఇంటర్నేషనల్ ప్యాక్, రీజనల్ ప్యాక్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి. సోనీ లివ్, జీ5, జియో హాట్ స్టార్, సన్ నెక్ట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. కానీ వారికి జెమినీ ఏఐ మాత్రం ఇవ్వరు. 

Advertisment
తాజా కథనాలు