/rtv/media/media_files/2025/11/11/golden-gifts-2025-11-11-13-17-47.jpg)
Golden Gifts
గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు(gold-and-silver-price) ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఊహించని రీతిలో పతనం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : అమాంతం పెరిగి... అంతలోనే ఢమాల్ అని పడిపోయింది.. వెండి దూకుడికి బ్రేక్
బంగారం ధరల్లో భారీ తగ్గుదల
హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజులుగా బంగారం ధరల పతనం(Gold Price Decrease In India) కొనసాగుతోంది. కేవలం 72 గంటల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 3,850 మేర తగ్గింది.
24 క్యారెట్ల బంగారం:రెండు రోజుల క్రితం రూ.1.43 లక్షల వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును తాకిన (10 గ్రాములు), తాజా మార్పులతో రూ.1,39,150కి చేరుకుంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,850 వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చే అంశం.
Also Read : ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి
కుప్పకూలిన వెండి ధరలు: ఒక్కరోజే రూ.17,200 పతనం
బంగారం కంటే వెండి ధర(silver-price-in-hyderabad) లో వచ్చిన మార్పు ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర ఒక్క రోజులోనే రూ.17,200 మేర పడిపోయింది. ఇటీవల రూ.2.50 లక్షల మార్కును దాటిన వెండి ధర, తాజా పతనంతో రూ. 2,40,800కి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం:
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఏకంగా 8 శాతం పడిపోయి 72.93 డాలర్ల వద్ద స్థిరపడటమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ భారీ పతనానికి ప్రధానంగా 'ప్రాఫిట్ బుకింగ్' కారణం. ఈ ఏడాది వెండి ధర సుమారు 138 శాతం, బంగారం ధర 75 శాతం పెరిగాయి. ఇంతటి భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల ఆశలు చిగురించడం వల్ల 'సేఫ్ హెవెన్'గా భావించే బంగారంపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టినా, దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.
Follow Us