Stock Market: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.

New Update
stock market today

stock market today

భారత స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీదుంది. ఈరోజు ఫ్రారంభం నుంచే సూచీలు లాభాలతో పరుగులు పెడుతున్నాయి. అంతర్జీతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో దేశీయంగా కొనగోళ్ళు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. 14 నెలల తర్వాత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై కు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. అంతకు ముందు సెప్టెంబర్ 27, 2024న సెన్సెక్స్ 85,978 మరియు నిఫ్టీ 26,277లు ఆల్ టైమ్ హై లో నిలిచాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగి 85,900 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 100 పాయింట్లు పెరిగి 26,300 వద్ద ట్రేడవుతోంది.

దేశీయ కొనుగోళ్ళు ఊపందుకున్నాయి..

ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి. ఈరోజు మార్కెట్ బలంగా ఉండడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో ఉండడమే అనిస్వస్తికఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ప్రవేశ్ గౌర్ చెబుతున్నారు. ఆసియా సూచీలు బలంగా ట్రేడవుతుండగా, వాల్ స్ట్రీట్ నిన్న రాత్రి సానుకూలంగా ముగిసిందని తెలిపారు. సెంటిమెంట్ భారతీయ ఈక్విటీలకు మద్దతు ఇచ్చింది దాంతో పాటూ తక్కువ స్థాయిలలో కొత్త కొనుగోళ్లను ప్రోత్సహించింది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్..వడ్డీ రేటును తగ్గించింది. ఇది కూడా మార్కెట్ ఉత్సాహానికి కారణమైందని చెప్పారు. వీటన్నింటితోపాటూ మార్కెట్ ర్యాలీకి షార్ట్ కవరింగ్ మరో కారణమని భావిస్తున్నారు. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ క్షీణించింది. షార్ట్ కవరింగ్ కు ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు.

నిఫ్టీలో హిందాల్కో, ఎల్‌ అండ్‌ టీ, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్‌ కంపెనీ, అపోలో హాస్పిటల్స్‌, మ్యాక్స్ హెల్త్‌కేర్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. రంగాల వారీగా ఆటో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లోహ, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

ప్రపంచ మార్కెట్లలో జోరు..

ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి 0.85% పెరిగి 3,994 వద్ద, జపాన్ నిక్కీ 1.30% పెరిగి 50,203 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ 0.14% పడిపోయింది. ఇక US మార్కెట్లలో నవంబర్ 26న డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.67% పెరిగి 47,427 వద్ద ముగిసింది. నాస్‌డాక్కాంపోజిట్ 0.82% , S&P 500 ఇండెక్స్ 0.69% లాభపడ్డాయి.

Advertisment
తాజా కథనాలు