/rtv/media/media_files/2025/11/26/iphone-17-discount-2025-11-26-07-44-09.jpg)
iPhone 17 Discount
iPhone 17 Discount: యాపిల్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేసిన iPhone 17 ఇప్పుడు క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో(Croma Black Friday Sale) భారీ తగ్గింపుతో లభిస్తోంది. iPhone 16తో పోల్చితే చాలా అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చిన ఈ ఫోన్, ఇప్పటి వరకు వచ్చిన సాధారణ (వనిల్లా) ఐఫోన్లలో అత్యంత మెరుగైనదిగా భావిస్తున్నారు. పరిమిత కాలం పాటు, ఈ ఫోన్‌ను దాదాపు రూ. 45,900 ధరకు పొందే అవకాశం ఉంది.
ధర తగ్గింపు ఎలా పని చేస్తుంది?
iPhone 17 అసలు ధర రూ. 82,900. కానీ క్రోమా ఆఫర్లతో ఇది తగ్గుతుంది:
- బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 1,000 క్యాష్‌బ్యాక్
- పాత ఫోన్ ఇచ్చినట్లయితే రూ. 7,000 అదనపు ఎక్స్చేంజ్ బోనస్
- మీ పాత ఫోన్‌పై గరిష్టంగా రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ విలువ
- ఈ అన్ని ఆఫర్లను కలిపితే iPhone 17 ధర రూ. 45,900కి తగ్గుతుంది. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
మీరు ఈ ఆఫర్ తీసుకోవాలనుకుంటే, iPhone 17లో ఏమి ఉంది? కొనాలా? లేదా వదిలేయాలా? అనేది తెలుసుకోవాలి. అందుకే క్రింది పాయింట్లను ఒకసారి చెక్ చేయండి.
iPhone 17 కొనడానికి 5 కారణాలు
1.120Hz డిస్ప్లే
చాలా ఏళ్లుగా యూజర్లు కోరుతున్న 120Hz స్క్రీన్‌ను యాపిల్ ఇప్పుడు మొదటిసారి సాధారణ ఐఫోన్లో ఇచ్చింది. ProMotion డిస్ప్లే వల్ల స్క్రోలింగ్, యాప్స్ ఉపయోగించడం చాలా స్మూత్‌గా ఉంటుంది. పాత ఐఫోన్ నుండి అప్‌గ్రేడ్ అయితే వెంటనే తేడా గమనిస్తారు.
2. శక్తివంతమైన A19 ప్రాసెసర్
ప్రతి సంవత్సరం ఐఫోన్లు పెర్ఫార్మన్స్ లో ముందే ఉంటాయి. iPhone 17లో ఉన్న A19 చిప్ వేగం ఇంకా మెరుగైంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో ఎలాంటి లాగ్ లేకుండా సులభంగా పనిచేస్తుంది. Pro మోడల్ చిప్ కాకపోయినా, సాధారణ యూజర్లకు ఇది మరింత సరిపోతుంది.
3. సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా
ఈసారి యాపిల్ కొత్తగా సెంటర్ స్టేజ్ సెల్ఫీ ఫీచర్‌ను ఇచ్చింది. ఇది ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కూడా గ్రూప్ సెల్ఫీలు తీశేలా సహాయపడుతుంది. 18MP సెల్ఫీ కెమెరా Pro మోడళ్లలో ఉన్నదే కావడంతో సెల్ఫీ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
4. బలమైన బ్యాటరీ + 40W ఫాస్ట్ ఛార్జింగ్
యాపిల్ బ్యాటరీ సామర్థ్యాన్ని బయటపెట్టకపోయినా, iPhone 17 ఒక రోజు అంతా సులభంగా పనిచేస్తుంది. సాధారణ వాడుకలో 11 గంటల వరకు నిలిచింది. ఈసారి 40W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వచ్చింది. 20 నిమిషాల్లో 0% నుంచి 50% వరకు చార్జ్ అవుతుంది. అయితే అడాప్టర్‌ను విడిగా కొనాలి.
5. “ప్రో” ఫీల్ ఇచ్చే వనిల్లా ఐఫోన్
పెద్ద లోపాలు లేకుండా, ఫీచర్లు పుష్కలంగా ఉండటంతో iPhone 17 సాధారణ ఐఫోన్ సిరీస్‌లో అత్యుత్తమంగా నిలిచింది. ఎక్కువ మంది యూజర్లకు అవసరమైన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.
iPhone 17 మైనస్‌లు ఇవే..!
టెలిఫోటో కెమెరా లేకపోవడం.. అన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ, టెలిఫోటో లెన్స్ లేకపోవడం కొంత మందికి నిరాశ కలిగించవచ్చు. చాలా Android ఫ్లాగ్షిప్ ఫోన్లలో మూడు కెమెరాలు ఉంటాయి. కానీ iPhone 17 మాత్రం రెండు కెమెరాలతోనే వచ్చింది.. 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్. జూమ్ ఫోటోలు తరచుగా తీసే వారికి ఇది మైనస్ అవుతుంది.
క్రోమా బ్లాక్ ఫ్రైడే ఆఫర్లో ధర భారీగా తగ్గడంతో iPhone 17 చాలా ఆకర్షణీయంగా మారింది. పెర్ఫార్మన్స్, డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా అనుభవం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే టెలిఫోటో కెమెరా అవసరం ఉన్నవారు కొనడానికి కొంచెం ఆలోచించాలి.
Follow Us