Lakshmi Mittal: బ్రిటన్‌కు బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్లనున్న అత్యంత ధనవంతుడు

భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌ దేశం వదిలివెళ్లారు. సూపర్ రిచ్‌లపై భారీగా పన్నులు విధించడానికి లేబర్ పార్టీ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో ఆయన యూకేను వీడి దుబాయ్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది.

New Update
lakshmi mittal uk

బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్(Lakshmi Mittal quits UK) కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ రిచ్‌లపై భారీగా పన్నులు విధించడానికి లేబర్ పార్టీ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌ను వీడి దుబాయ్‌కు మకాం మార్చినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా లండన్‌లో నివాసం ఉన్న మిట్టల్, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 'ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025' ప్రకారం, ఆయన సంపద విలువ సుమారు 15.4 బిలియన్ పౌండ్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 1.6 లక్షల కోట్లు) ఉంది.

మిట్టల్ వైదొలగడానికి ప్రధాన కారణం ఆదాయం, లాభాల పన్ను కాదని, బలవంతంగా విధించబోతున్న వారసత్వ పన్ను అని ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. యూకేలో ప్రస్తుత నిబంధనల ప్రకారం, విదేశీ సంపన్నులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై 40 శాతం వరకు వారసత్వ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఆస్తులు ఉన్నా యూకేలో పన్ను విధించడాన్ని విదేశీ బిలియనీర్లు సహించడంలేదు. విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చే 226 ఏళ్ల నాటి 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని లేబర్ ప్రభుత్వం రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడం కూడా ఈ వలసలకు దారితీసింది.

Also Read :  చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. అరుణాచల్ వివాదంలో మారని చైనా తీరు

Lakshmi Mittal Quits UK

Also Read :  పాకిస్తాన్ లోని సింధ్ లో హిందూ జనాభా ఎంత? ఈ ప్రావిన్స్ ఎందుకు ముఖ్యమైనది?

వారసత్వ పన్ను లేని దుబాయ్‌లో లక్ష్మీ మిట్టల్ స్థిరపడాలనుకున్నారు. భవిష్యత్తులో ఆయన తన సమయాన్ని ఎక్కువ భాగం దుబాయ్‌లో గడిపే అవకాశం ఉందని, అక్కడ కూడా ఆయన ఇప్పటికే విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లక్ష్మీ మిట్టల్ ఈ విధంగా దేశం విడిచి వెళ్లడం, పన్నుల భారం పెరుగుతుందనే భయంతో బ్రిటన్‌ను వీడుతున్న అనేకమంది సంపన్నుల వలసలకు నిదర్శనంగా మారింది. సంపన్నులు దేశాన్ని వీడటం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు