/rtv/media/media_files/2025/08/28/mutual-funds-2025-08-28-10-59-29.jpg)
Mutual Funds
సేవింగ్స్(savings) కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్(mutual-funds) లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో రెట్లు లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు ఎన్నో రెట్లు పెరగడానికి ముఖ్య కారణం కంపౌండింగ్. దీనివల్ల ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max: ఐఫోన్ vs షియోమి.. ఏ ఫోన్ బెస్ట్.. ధర, కెమెరా, బ్యాటరీ ఫుల్ డీటెయిల్స్..!
కంపౌండింగ్ అంటే ?
మనం ఏదైనా పెట్టుబడి(investment) పెట్టినప్పుడు మొదటి సంవత్సరంలో వచ్చిన లాభం (వడ్డీ) మళ్లీ అసలు (ప్రిన్సిపల్) లో కలిసిపోతుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఆ పెరిగిన మొత్తంపై మళ్లీ లాభం వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం లాభం అసలులో కలిసిపోతూ పోవడంతో, తర్వాతి సంవత్సరాల్లో పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని 'వడ్డీ మీద వడ్డీ' అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ వంటి నిపుణులు కూడా కంపౌండింగ్ ప్రాధాన్యతను పదేపదే చెప్పారు. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడిని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా అవసరం అని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.
కోటక్ మిడ్ క్యాప్ ఫండ్
దీనికి ఉదాహరణగా కోటక్ మిడ్ క్యాప్ ఫండ్-డైరెక్ట్ స్కీమ్(Kotak Mid Cap Fund Direct Scheme) అని చెప్పవచ్చు. కొన్నేళ్ల కింద ఇందులో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి భారీగా పెరిగింది. ఒక లక్ష రూపాయలు పెట్టుబడి మూడేళ్లకు పెడితే, అది ఇప్పుడు దాదాపు రూ. 1.86 లక్షలకు చేరింది. అంటే సగటున సంవత్సరానికి 23.16 శాతం లాభం వచ్చినట్టు. ఐదు సంవత్సరాల కింద ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి వారి మొత్తం రూ. 3.72 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 30 శాతం వార్షిక రాబడికి సమానం. అదే పది సంవత్సరాల క్రితం ఒక లక్ష రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా రూ. 6.04 లక్షలు అయ్యింది. సగటు వార్షిక లాభం 19.72 శాతం. ఫండ్ ప్రారంభం 2013 జనవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదికి 21.13 శాతం లాభాన్ని ఇచ్చి ఆ మొత్తాన్ని దాదాపు 11.48 లక్షలకు పెంచింది. కంపౌండింగ్ వల్ల భారీగా లాభాలు పెరుగుతాయి. అయితే మీరు ఈ కోటక్ మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. సుమారుగా 69.16 శాతం మిడ్‌క్యాప్ స్టాక్స్ లో, 14.66 శాతం స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో,14.06 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో చేయాలి. అయితే ఇందులో ఐటీ సాఫ్ట్‌వేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్, రిటైలింగ్, ఆటో కాంపోనెంట్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు వస్తాయి.
ఇది కూడా చూడండి: Xiaomi 17: దుమ్ములేపిన షియోమి.. నాలుగు 50MP కెమెరాలు, 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదుర్స్..!