Xiaomi 17: దుమ్ములేపిన షియోమి.. నాలుగు 50MP కెమెరాలు, 7,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదుర్స్..!

షియోమీ సంస్థ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ షియోమీ 17 సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇందులో షియోమీ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఇవి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చాయి. వెనుకవైపు మూడు 50ఎంపీ కెమెరాలు, ముందువైపు 50ఎంపీ కెమెరా ఉంది.

New Update
Xiaomi 17 Price & Offer (1)

Xiaomi 17 Price Offer

Xiaomi తన కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Seriesను నిన్న అంటే సెప్టెంబర్ 25న చైనాలో విడుదల చేసింది. ఇందులో షియోమీ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్ Qualcomm తాజా ఫ్లాగ్‌షిప్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్, పనితీరు, బ్యాటరీ పరంగా ఒక ప్రధాన అప్‌గ్రేడ్‌తో వచ్చింది. అలాగే LTPO AMOLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 3500 nits గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి వెనుక భాగంలో మూడు 50MP సెన్సార్లు, ముందు భాగంలో ఒక 50MP సెన్సార్ ఉన్నాయి.

Xiaomi 17 Price & Offer

Xiaomi 17 మొత్తం మూడు వేరియంట్లలో వచ్చింది. అందులో

12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 56,000. 

12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 60,000.

16GB RAM + 512GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 62,000గా ఉంది. 

ఈ ఫోన్ వైట్, బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుక్కోవచ్చు. 

Xiaomi 17 Specs

Xiaomi 17 మొబైల్ 6.3-అంగుళాల 2,656×1,220 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ప్యానెల్ LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.  ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్, అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పై నడుస్తుంది. ఇది 16GB వరకు RAM + 512GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. 

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. Xiaomi 17 క్వాడ్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 23mm లైట్ హంటర్ 950 సెన్సార్, OIS సపోర్ట్ ఉన్నాయి. అలాగే OIS సపోర్ట్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 102° FoVతో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందు కెమెరాలో 50MP షూటర్ ఉంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే Xiaomi 17 బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈసారి ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Advertisment
తాజా కథనాలు