/rtv/media/media_files/2025/09/26/xiaomi-17-pro-max-vs-iphone-17-pro-max-2025-09-26-21-31-14.jpg)
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max: ఆపిల్ ఇటీవల విడుదల చేసిన iPhone 17 Pro Max తో నేరుగా పోటీ పడటానికి.. Xiaomi దాని కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Pro Max ను తాజాగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు వాటి కెమెరా సెటప్ విషయంలో చాలా పోలి ఉంటాయి. కానీ ధర, ఫీచర్లు, పనితీరు పరంగా Xiaomi.. ఐఫోన్‌తో పోటీ పడగలదా? లేదా అనేది తెలుసుకుందాం.
డిస్‌ప్లే
iPhone 17 Pro Max.. 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
Xiaomi 17 Pro Max.. 6.9 -అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 2K రిజల్యూషన్‌తో వస్తుంది. Xiaomi హైలైట్ దాని సెకండరీ M10 మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్. ఇది వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడానికి, గేమ్‌లు ఆడటానికి, అలారాలు సెట్ చేయడానికి అనుమతిస్తుంది.
ప్రాసెసర్
ఈ రెండు ఫోన్‌లు అధునాతన చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి. iPhone 17 Pro Max.. A19 ప్రో 3nm చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
Xiaomi 17 Pro Max.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (3nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంది. రెండు చిప్‌సెట్‌లు శక్తి, సామర్థ్యం పరంగా బెస్ట్ పనితీరును అందిస్తాయి.
కెమెరా ఫీచర్లు
iPhone 17 Pro Maxలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48MP ప్రధాన సెన్సార్, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 48MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. అదే సమయంలో ముందు భాగంలో 18MP ముందు కెమెరా ఉంది.
Xiaomi 17 Pro Maxలో లైకా-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP లైట్ హంటర్ 950L ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో సెన్సార్ ఉంది. అదే సమయంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ & ఛార్జింగ్
iPhone 17 Pro Max.. eSIM మోడల్ బ్యాటరీ సామర్థ్యం 5,088mAh. నానో-సిమ్ మోడల్ 4,832mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
Xiaomi 17 Pro Max.. 7,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
సేఫ్టీ
iPhone 17 Pro Max ఫోన్ IP68 రేటింగ్‌తో సిరామిక్ షీల్డ్, ముందు వెనుక కవర్‌ను కలిగి ఉంది.
Xiaomi 17 Pro Max ఫోన్ IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. డిస్ప్లే Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ద్వారా సేఫ్టీను కలిగి ఉంది.
ధర
iPhone 17 Pro Max Price
256జీబీ ధర రూ.1,49,900.
512జీబీ ధర రూ.1,69,900.
1TB ధర రూ.1,89,900.
2TB ధర రూ.2,29,900గా ఉంది.
Xiaomi 17 Pro Max Price
12GB + 512GB వేరియంట్ ధర రూ.74,700.
16GB + 512GB వేరియంట్ ధర రూ.78,500.
16GB + 1TB వేరియంట్ ధర రూ.87,200గా ఉంది.
Xiaomi ధర ఐఫోన్ ధరలో దాదాపు సగం. కాబట్టి బడ్జెట్ పరంగా షియోమి ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.