/rtv/media/media_files/2026/01/08/crash-2026-01-08-17-10-16.jpg)
రీసెంట్ గా ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టపోయింది. గత కొన్ని రోజులుగా సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. కానీ ఈ రోజు మాత్రం మార్కెట్ క్రాష్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్(indian-stock-market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్యం కొలిక్కి రాకపోవడం ఒక కారణం అయితే...రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ పై 500 వాతం సుంకాలను విధిస్తామని...దానికి సంబంధించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా మార్కెట్ ను దెబ్బ తీసింది. దీంతో విదేశీ మదుపర్లు విపరీతంగా అమ్మకాలు చేపట్టారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న భౌగోళిక ఉద్రిక్తతలు కూడా మార్కెట్ సెంటిమెంట్ మీద ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో టోటల్ గా భారత స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది(stock-market-crash). సెన్సెక్స్(sensex-today) 780 పాయింట్లు పడిపోయి 84,181 వద్ద క్లోజ్ అవ్వగా..నిఫ్టీ కూడా 264 పాయింట్లు పడిపోయి 25,877 వద్ద ముగిసింది.
Also Read : భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్
రోజంతా నష్టాలతోనే ఈది..
ఈ రోజు మార్కెట్ మొదలవ్వడమే నష్టాలతో ప్రారంభం అయింది. సెన్సెక్స్ ఉదయం 84,778.02లతో నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడితోనే కొనసాగింది. మొదటి కొన్ని గంటల్లో మార్కెట్ కోలుకోవడానికి ప్రయత్నించినప్పటికీ చివరలో..చమురు, బ్యాంకింగ్ స్టాక్ లలో అమ్మకాలు విపరీతంగా జరగడంతో మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. ఇంట్రాడేలో 84,110.10 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 263.90 పాయింట్ల నష్టంతో 25,876.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటెర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. దీంతో స్టాక్ మార్కెట్లో 8 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ₹7 లక్షల కోట్లకు పైగా తగ్గి, ₹479 లక్షల కోట్ల నుండి ₹472 లక్షల కోట్లకు పడిపోయింది.
అయితే మార్కెట్ క్షీణత మధ్య, కొన్ని స్టాక్‌లు పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం కలిగించాయి. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇటీవల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత 2% లాభపడి ముగిసింది. బాలాజీ అమైన్స్ షేర్లు 14% పెరిగాయి. డెంగ్యూ వ్యాక్సిన్ తాలూకా క్లినికల్ ట్రయల్స్‌ను కంపెనీ పూర్తి చేసిన తర్వాత పనాసియా బయోటెక్ కూడా 13% పెరిగింది. ప్రపంచ మార్కెట్లో వస్తువుల ధరలు తగ్గడం వల్ల హిందుస్తాన్ జింక్, జిందాల్ స్టీల్ వంటి మెటల్ స్టాక్స్ 7% వరకు పడిపోయాయి. - business news telugu
Also Read : JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!
అంతర్జాతీయ మార్కెట్..
మరోవైపు ప్రపంచ మార్కెట్లు కూడా పెద్దగా ముందుకు వెళ్ళలేదు. అక్కడ కూడా మిశ్రమ సంకేతాలు కనిపించాయి. ఆసియా మార్కెట్లలో.. కొరియా కోస్పి 0.029% పెరిగి 4,552 వద్ద, జపాన్ నిక్కీ ఇండెక్స్ 1.63% తగ్గి 51,117 వద్ద ముగిశాయి.హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.17% తగ్గి 26,149 వద్ద ముగిసింది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.068% తగ్గి 4,082 వద్దకు చేరుకుంది. జనవరి 7న, US డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.94% తగ్గి 48,996 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.16% పెరిగింది. S&P 500 0.34% పడిపోయింది.
Follow Us