/rtv/media/media_files/2025/11/03/anil-ambani-2025-11-03-19-41-14.jpg)
Anil Ambani
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ(anil-ambani) మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ సంచలన చర్యలకు ఉపక్రమించింది. విచారణలో భాగంగా అనిల్ అంబానీకి చెందిన రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇందులో అనిల్ అంబానీ ఇల్లుతో పాటు పలు కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉండటం గమనార్హం.
Also Read: బాబోయ్ బస్సులు.. మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల.. 2 నెలల్లో 100 మంది బలి!
ED Attaches Assets Against Anil Ambani
ముంబయిలోని పాలిహిల్ ప్రాంతంలో అనిల్ అంబానీ ఇల్లు ఉంది. ఈ ఇంటితో పాటు ఢిల్లీలోని రిలయన్స్ సంస్థకు చెందిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసింది. ముంబయి, ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్, పుణె, ఠాణె, చెన్నై, హైదరాబాద్, తూర్పు గోదావరిలో ఉన్న అనిల్ అంబానీకి కంపెనీలకు చెందిన కొన్ని నివాస, వాణిజ్య ఆస్తులు కూడా ఈడీ అటాచ్ చేసిన లిస్టులో ఉన్నాయి. వీటి విలువ రూ.3,084 కోట్లు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read: డిజిటల్ అరెస్టుతో రూ.3 వేల కోట్లు మాయం.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
ఇదిలాఉండగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు బ్యాంకు రుణాలు తీసుకోని మోసానికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. వీటిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాతో పాటు అనిల్ అంబానీకి చెందిన వివిధ కంపెనీలు రూ.1700 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.అయితే ఈ ఏడాది జులైలో రిలయన్స్ గ్రూప్‌లో 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు చేసింది. మరోవైపు అనిల్ అంబానీతో పాటు కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ అధికారును కూడా దర్యాప్తు చేసింది .
Also Read: పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
 Follow Us