Bus Accidents: బాబోయ్ బస్సులు.. 2 నెలల్లో 100 మంది బలి! - మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల

దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

New Update
Bus Accidents 2025 (1)

Bus Accidents 2025

దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మరీ ముఖ్యంగా అక్టోబర్, నవంబర్‌లో బస్సు విషాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో(Bus Accident news) దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

తెలంగాణలో పెను విషాదం

ఇవాళ (నవంబర్ 3న, సోమవారం) ఉదయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ (ఖానాపూర్ గేట్ సమీపం) వద్ద ఘోర బస్సు ప్రమాదం(BUS ACCIDENT INCIDENT) జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. అనంతరం లారీలో ఉన్న కంకర లోడు బస్సుపై పడిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, ట్రక్కు డ్రైవర్లతో సహా మహిళలు, చిన్నారులు, విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు.

Also Read :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!

రాజస్థాన్‌లో బస్సు అగ్ని ప్రమాదం

రాజస్థాన్‌లో గత నెల 14 (అక్టోబర్ 14)న ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై ప్రైవేట్ బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దాదాపు 57 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేట్ బస్సులో‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డోర్లు లాక్ అవడంతో ప్రయాణికులు బయటకురాలేక అందులోనే బూడిదయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం

రాజస్థాన్‌లో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదం జరిగి సరిగ్గా పది రోజుల తర్వాత ఏపీలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలోని హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవేపై దారుణమైన బస్సు అగ్నిప్రమాదం జరిగింది. ఒక బైక్‌ను ఢీకొట్టిన తరువాత ప్రైవేట్ బస్సు స్లీపర్ కోచ్ పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదైపోయారు. ఒక బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. 

రాజస్థాన్‌లో అంతులేని విషాలు

రాజస్థానంలో అక్టోబర్ 14న జరిగిన బస్సు ప్రమాదం మరువక ముందే నవంబర్ 2న మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫలోడిలో పర్యాటక బస్సు ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 

అది కాకుండా ఇవాళ (నవంబర్ 3న) జైపూర్‌లోని లోహా మండిలో ఒక డంపర్ ప్రజలకు ప్రాణాపాయంగా మారింది. సికార్ రోడ్డుపై నియంత్రణ కోల్పోయిన డంపర్ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read :  SLBC టన్నెల్‌ పూర్తి చేసి తీరుతాం.. సీఎం రేవంత్

గుజరాత్‌లో ప్రమాదం

గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లగ్జరీ బస్సును అతివేగంగా వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు విడిచారు. 

ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం

అక్టోబర్ 25న ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వెనుకనుంచి వచ్చిన ఒక లారీ అకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 

ఇలా అక్టోబర్, నవంబర్‌లో దారుణమైన విషాలు చోటుచేసుకున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న చిన్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 

Advertisment
తాజా కథనాలు