Digital Arrest: డిజిటల్ అరెస్టుతో రూ.3 వేల కోట్లు మాయం.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

డిజిటల్ అరెస్టు మోసాలపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి రూ.3 వేల కోట్లు రాబట్టడం దిగ్ర్భాంతికరమని పేర్కొంది. వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

New Update
Supreme Court Sensational Comments on Rs 3,000 Crore Digital Arrests

Supreme Court Sensational Comments on Rs 3,000 Crore Digital Arrests

ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఎంతో మంది వేలు, లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా వీటికి సంబంధించిన స్కామ్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోంది. అయితే ఈ మోసాలపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి రూ.3 వేల కోట్లు రాబట్టడం దిగ్ర్భాంతికరమని పేర్కొంది. 

ఈ నేరాలపై తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే నేరగాళ్లు పెచ్చుమీరుతారని అసహనం వ్యక్తం చేసింది. వీటికి అడ్డుకునేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపింది. ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్టు అనేది పెద్ద సవాలుగా మారిందని.. ఇతర దేశాల్లో వీటి పరిస్థితి ఎలా ఉందో తెలియదని చెప్పింది. మన దేశంలో సాంకేతిక, ఆర్థిక డిపార్ట్‌మెంట్‌లు మరింత సమర్థవంతగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాని ఆదేశించింది.  

Also Read: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్ - దారుణమైన విజువల్స్

Supreme Court Comments On Digital Arrest

మరోవైపు డిజిటల్ అరెస్టు కేసుల్లో వృద్ధులే ఎక్కువగా ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యూనిట్ ఉందని పేర్కొ్న్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు వివరాలు దాఖలు చేసేందుకు టైమ్ కావాలని అన్నారు. అయితే ఈ డిజిటల్ అరెస్టు మోసాల వ్యవహారంపై విచారణకు CBIకి అప్పగించాలని భావిస్తున్నట్లు గత విచారణలో సుప్రీంకోర్టు తెలిపింది. 

Also Read: ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!

వీటిపై విభిన్న రాష్ట్రాల్లో నమోదైన కేసులకు సంబంధించి విస్తృతంగా దర్యాప్తు జరిగే టెక్నికల్, సిబ్బంది పరమైన వనరులు ఉన్నాయా? అని కూడా అడిగింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఇప్పటికే CBI ఇలాంటి మోసాలపై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ క్రైమ్ డివిజన్ నుంచి సాంకేతిక సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు