Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే.

ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు.

New Update
Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే.

Asia Cup India vs Pakistan : ఆసియా కప్ లో భారత్ -పాక్ మ్యాచ్ కు వర్షం మరోసారి అడ్డుపడింది. సూపర్ -4లో భాగంగా కొలంబోలో నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ 24.1 ఓవర్లకు 147 పరుగులు చేసింది. దాని తర్వాత వర్షం పడడంతో ఆటకు అంతరాయం కలిగింది. తర్వాత వర్షం తగ్గినప్పటికీ అవుట్ ఫీల్డ్ బాగా తడిగా ఉండడంతో మ్యాచ్ ను రిజర్వ్ డేకు పోస్ట్ పోన్ చేశారు. దీని ప్రకారం ఈరోజు మ్యాచ్ తిరిగి ప్రారంభం అవుతుంది. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్ మన్ గిల్ లు చెరో హాఫ్ సెంచురీ చేశారు. కోహ్లీ (Kohli), రాహుల్ (KL Rahul) క్రీజ్ లో ఉన్నారు.

కొలంబోలో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అలాంటప్పుడు రిజర్వ్ డే (Reserve day) కూడా మ్యాచ్ జరగకపోతే ఎలా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న ఎక్కడ అయితే ఆపేశారో అక్కడి నుంచి మ్యాచ్ ను మొదలుపెడతారు. వర్షం లేకపోతే అంతా సజావుగానే సాగుతుంది. కానీ వాన పడింది అంటే మాత్రం రూల్స్ మారిపోతాయి.

రిజర్వ్ డే రోజు వర్షం పడితే ఏం జరుగుతుంది...

మ్యాచ్ ఫలితం తేలాలంటే రూల్ ప్రకారం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాలి. దాని ప్రకారం భారత్ ఇప్పటికే 24 ఓవర్లు ఆడేసింది. కాబట్టి వర్షం కనుక పడితే డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను అంపైర్లు నిర్ణయిస్తారు. ఇది కూడా వర్షం పడి ఆగి మ్యాచ్ మళ్ళీ మొదలైతేనే. అలా కాలేదు అస్సలు మ్యాచే జరగలేదు అంటే మాత్రం మొత్తానికే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

పాపం భారత్...
ఒకవేళ మ్యాచ్ కనుక రద్దు అయితే టీమిండియాకు కష్టమే. సూపర్ -4 పాయింట్ల లిస్ట్ లో పాకిస్తాన్, శ్రీలంక ఇప్పటికే చెరో గెలుపును సొంతం చేసుకున్నాయి. కానీ భారత్ కు మాత్రం ఇదే మొదటి మ్యాచ్. ఇప్పటివరకు మన టీమ్ కు అసలు పాయింట్లే రాలేదు. మరోవైపు బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది కాబట్టి ఆ దేశం దాదాపు టోర్నీ నుంచి వెళ్ళిపోయినట్టే. దీని ప్రకారం ఈరోజు మ్యాచ్ రద్దయితే భారత్ కు ఒక పాయింట్ వస్తుంది. పాకిస్తాన్ కు ఒక పాయింట్ వచ్చి పట్టికలో మూడు పాయింట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫైనల్ కు చేరాలంటే తక్కిన అన్ని మ్యాచ్ లూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ కు తరువాతి మ్యాచ్ లు శ్రీలంక, బంగ్లాదేశ్ తో ఉన్నాయి. ఈ రెండు టీమ్ లతో మ్యాచ్ లు గెలిస్తేనే 5 పాయింట్లతో భారత్ ఫైనల్ కు వెళ్ళగలుగుతుంది.

Also Read: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్ విజేతగా సెర్బియా స్టార్

Advertisment
Advertisment
తాజా కథనాలు