🔴Live News Updates: తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తిరుపతి జిల్లాలో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ పేషెంట్ బంగారు గాజులను దొంగిలించాడు. ప్రమిల అనే మహిళకు గాయలు అయ్యాయి. ఆమెకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెల్లడంతో 6సవర్ల గాజులు పట్టుకుని పారిపోయాడు.
ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంతో వస్తున్న ఓ వాహనం ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి ముచ్చటించారు. అనంతరం బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించి.. ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులు, సామాన్యులతో ముచ్చటించారు.
అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.
అఘోరీ తన మొదటిపెళ్లి వార్తలపై స్పందించింది. ‘‘రాధ అనే మహిళ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది. నాకు ఆమెతో పెళ్లే కాలేదు. ఆమె మొదటి భర్త చనిపోతే డిప్రెషన్ నుంచి కోలుకునేలా చేశాను. అందుకోసమే తాళి కడతా అన్నాను. కానీ కట్టలేదు. ఆధారలుంటే చూపించండి’’ అని తెలిపింది.
విశాఖపట్నం పీఎం పాలెం ప్రాంతంలో జ్ఞానేశ్వర్, అనూష మధ్య మనస్పర్థలు చెలరేగాయి. అనూష 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా, భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జ్ఞానేశ్వర్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
అఘోరీ తన మొదటి భార్యతో గతంలో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ‘రాధీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యు లవ్ యు. నావల్ల కావట్లేదు. హార్ట్‌లో పెయిన్‌గా ఉంది. మనిద్దరం జీవితాంతం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉండాలనేది నా కోరిక’ అంటూ అఘోరీ చెప్పడం వినవచ్చు.
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల ఈ రోజు దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.