Aghori First Wife: వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్

అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.

New Update

‘‘అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరీ మొదటి భార్యను నేను. ఆ వర్షిణీని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా నేను ఉంటుండగా ఆమెను మరోపెళ్లి ఎలా చేసుకుంటాడు. నేను చట్ట పరంగా చర్యలు తీసుకుంటా. నా మెడలో తాళి కట్టి.. ఇప్పుడు వర్షిణీని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు.’’ అని అఘోరీ మొదటి భార్య రాధ మీడియా ముందుకు వచ్చింది. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

వర్షిణి గలీజ్ పిల్ల

అనంతరం శ్రీవర్షిణి గురించి సంచలన విషయాలు మాట్లాడింది. ‘‘ నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఆమెలా పేరెంట్స్‌ను వదిలి.. వాళ్లను బాధపెట్టేంత క్యారెక్టర్ నాది కాదు. నాకు, అఘోరీకి మ్యారేజ్ అయిందని వర్షిణీకి కూడా ముందే తెలుసు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతాను అని ఇటీవల ఒక లైవ్‌లో వర్షిణి చెప్పింది. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ (అఘోరి) వల్ల నాకు అన్యాయం జరిగింది. కాబట్టి వర్షిణీ కూడా నాతో పోరాటం చేయాలి. లేదంటే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించు. నేను ఏం చేస్తానో తర్వాత అందరికీ తెలుస్తాది. వర్షిణి నిజంగా నువ్వొక ఆడపిల్లే అయితే.. అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. నా చేతులతో వాడికి పెళ్లి చేస్తాను’’ అని మాట్లాడింది. 

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రొమాంటిక్ కాల్

ఈ క్రమంలో అఘోరీ తన మొదటి భార్యతో మాట్లాడిన రొమాంటికి ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియో ప్రకారం.. ‘‘రాధీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నావ్. కానీ ఏం చేస్తాం. నేను వచ్చిన తర్వాత నీకు తాళి కడతాను రాధీ. లవ్ యు లవ్ యు. మిస్ యు లవ్ యు. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

నాతోని అవ్వట్లేదు. హార్ట్‌లో చాలా పెయిన్‌గా ఉంది. మనిద్దరం ఇలాగే జీవితాంతం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉండాలనేది నా కోరిక. ఆ కోరికను నువ్ ఎంత దూరం తీసుకెళ్తావో నీ డెషిషన్. నువ్వు ఎప్పుడూ నాకు స్పెషల్. నీకు తాళి కట్టిన తర్వాత నీ లెవెల్ వేరే. ’’ అంటూ ఆ ఆడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది.

(aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు