Road Accident: వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంతో వస్తున్న ఓ వాహనం ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Road Accident Kadapa

Road Accident Kadapa

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంతో వస్తున్న ఓ వాహనం ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

రంగారెడ్డి జిల్లాలో కూడా..

ఇదిలా ఉండగా ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అనే అక్కచెల్లెళ్ల పిల్లలు బంధువుల నివాసంలో వివాహ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో వారు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్గర ఆడుకున్నారు. ఆ సమయంలో వారు ఆటల్లో భాగంగా కారులోకి వెళ్లారు. ఆ సమయంలో కార్ డోర్లు లాక్ అయ్యాయి. దీంతో వారు బయటకు రాలేకపోయాయి.  

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

దీంతో ఊపిరి ఆడక ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే.. చిన్నారులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు కారులో అపస్మారకంగా కనిపించారు. దీంతో వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

latest-telugu-news | Vottimitta | road-accident | ysr-kadapa-district | andhra-pradesh-news | today-news-in-telugu | breaking news in telugu

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు