/rtv/media/media_files/2025/02/04/LBNaT5EhX3WnExmtpTlG.jpg)
sipai mlc
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది.పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
Also Raed: Jani Master : జానీ మాస్టర్కు గ్రాండ్ వెల్కమ్.. కొరియోగ్రాఫర్ ఎమోషనల్
అర్థరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి కొందరు వ్యక్తులు తీసుకునివెళ్లినట్లు చెబుతుంది. దీని పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఆయన ఓటు కీలకం కానుంది.
డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండో రోజు తిరుపతి లో అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద, అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు చేరడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక క్రమంలో ఒకరిపై ఒకరు దాడిచేశారంటూ పుకార్లు షికారు చేయడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
తనను కిడ్నాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించారని 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమత ఆరోపించారు. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసులు సమక్షంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇరిపార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిపిస్తారన్న నమ్మకం లేదన్నారు.కూటమి నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నికల్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపారని, మరో ఆరుగురు ఉదయం వస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన నాటకీయ పరిణామాలు అందరూ చూశారు. తమ కార్పొరేటర్లను వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయించుకొని కూటమి ప్రభుత్వంపై నింద మోపేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
ఉదయం మిస్సయిన నలుగురు కార్పొరేటర్లు తాము సురక్షితంగా ఉన్నామని వారే వీడియో ద్వారా తెలిపారు. ఎన్నిక గందరగోళం వల్ల తాము సురక్షిత ప్రాంతానికి వచ్చేశామని వారే చెప్పారు. భూమన కరుణాకరరెడ్డి గతంలో ఎన్నో అరాచకాలు చేశారని, అవన్నీ తిరుపతి ప్రజలందరూ చూశారన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కరుణాకరరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనేక అరాచకాలకు పాల్పడింది.
దొంగ ఓటరు కార్డులు తయారు చేయించి తమిళనాడు నుంచి వ్యక్తులను ఇక్కడికి తరలించి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. మేం ఎలాంటి దౌర్జన్యాలకు, కిడ్నాప్లకు పాల్పడలేదు. తిరుపతి డ్యిపూటి మేయర్ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరగాలి. తన కొడుకు భూమన అభినయ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కరుణాకర్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డుతున్నారని’ కిరణ్ రాయల్ మండిపడ్డారు.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!
Also Read: America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!