Jani Master : జానీ మాస్టర్కు గ్రాండ్ వెల్కమ్.. కొరియోగ్రాఫర్ ఎమోషనల్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ కు వెళ్లిన  ఆయనకు మేకర్స్ గుమ్మడికాయతో దిష్టి తీయించారు. అనంతరం కేక్ కట్ చేయించి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో వైరల్ గా మారింది

New Update
jani master back

jani master back

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్  అయి బెయిల్ పై రిలీజైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలాకాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ కు వెళ్లిన  ఆయనకు మేకర్స్ గుమ్మడికాయతో దిష్టి తీయించారు. అనంతరం కేక్ కట్ చేయించి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. వాళ్లు చూపించిన  ప్రేమకు జానీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం చేసి థాంక్యూ చెప్పారు. ఇందుకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే ఇంతకీ ఇది ఏ సినిమా అనేది తెలియాల్సి ఉంది.  

"చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు సంతోషంగా ఉంది.  ఇంతటి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు.  దీంతో ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలానే మీరు మళ్లీ బిజీ కావాలని... మీకు మిస్ అయిన నేషనల్ అవార్డు రావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి

జానీ మాస్టర్ పై ఓ మహిళా డాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టగా జైలుకెళ్లి బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. బెయిల్ నుంచి బయటకు వచ్చిన జానీకి సినిమా ఇండస్ట్రీలో మళ్లీ అవకాశాలు వస్తాయా రావో అని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ఓ మూవీలో ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక తనపై నమోదైన కేసుపై జానీ మాస్టర్ ఇప్పటికే స్పందించారు.  తాను ఏ తప్పూ చేయలేదని.. విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటికొస్తాయని జానీ చెబుతున్నారు.  

Also Read :  Masthan sai : లావణ్య చెప్పింది తూచ్.. ఆ వీడియోలో ఉన్నది నా భార్య .. మస్తాన్ సాయి బిగ్ ట్విస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు