BREAKING: బిహార్ కాబోయే సీఎం అతడే.. బిగ్ ట్విస్ట్!
మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.
మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సబేష్ మరణం తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది
విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శుక్రవారం ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. జైస్వాల్ వెళ్తున్న మోటార్‌బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాలలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వైపు పెద్దపల్లిలో బైక్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి.. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.