Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.