AP: డిప్యూటీ సీఎం పవన్‌ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

New Update
Pawan Kalyan wife

Pawan Kalyan wife

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై కూడా సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌గా గుర్తించిన పోలీసులు..

కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

 

Mark Shankar | vijayawada | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

ఇది కూడా చూడండి: ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు