Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో

అలేఖ్య చిట్టి హాస్పిటల్‌లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటూ తెలిపింది. దయచేసి ట్రోలింగ్ ఆపండంటూ వేడుకుంది.

New Update

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమే నడుస్తోంది. ఆమె తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే వైరల్ అవుతోంది. మీ పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు అలేఖ్య చిట్టి బూతులతో రెచ్చిపోయింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు.. రేటు ఎక్కువ అంటున్నావు అంటే మీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు.. అంటూ నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయింది. అది కాస్త వైరల్‌ కావడంతో మీమ్స్, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో అలేఖ్యతో పాటు తన అక్కా, చెల్లిని కూడా బయటకులాగారు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

వీరి ముగ్గురిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వారికి కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము చేసింది తప్పేనని.. ఇకపై అలా చేయమని.. ఎవరినైతే తిట్టామో వారికి క్షమాపణలు చెబుతున్నామంటూ ముగ్గురు అక్కా చెల్లెల్లు వీడియోలు రిలీజ్ చేశారు. అయినా వారిపై ట్రోలింగ్స్ ఆగలేదు. ఇక ఈ విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి తీవ్ర మనస్థాపంతో అనారోగ్యబారిన పడింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ICUలో అలేఖ్య చిట్టి

అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌‌లో ఉంది. ఆమెను ICU వార్డ్‌లో ఉంచారు. అందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య అక్క సుమీ (సుమ) సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలేఖ్య చిట్టికి సీరియస్‌‌గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ICU బెడ్‌పై ఉందని తెలిపింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో చేరినట్లు పేర్కొంది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా- కష్టంగా ఉందంటూ ఎమోషనల్ వీడియోను సుమీ రిలీజ్ చేసింది. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అలేఖ్య చెల్లి ఆరోగ్యం అస్సలు బాలేదని తెలిపింది. సారీ చెప్పినా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన చెందింది. దయచేసి ట్రోలింగ్ ఆపండి అంటూ నెటిజన్లను వేడుకుంది. మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదని.. ఇంకో చావు మా ఇంట్లో జరుగుతుందని భయం వేస్తోందని సుమీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. 

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు