AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 202425కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 202425కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది.
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సీ ప్లేన్ 14 మంది కెపాసిటీతో ప్రయాణించనుంది.
AP: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఆంధ్రాలో వైసీపీ పార్టీకి,ఐప్యాక్ కన్సెల్టెన్సీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.2024 వైసీపీ ఓటమి తర్వాత మాయమైన ఐప్యాక్ ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి అడుగుపెడుతోందని తెలుస్తోంది.2029 ఎన్నికల కోసం జగన్ ఐప్యాక్‌ను మళ్ళీ రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లి, చెల్లి అని చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ ఆర్ కు పుట్టలేదని తనను అవమానించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP: వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ నుంచి వైసీపీ తప్పుకుందని అన్నారు.
AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.