Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 

New Update
borugadda anil

పలు కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి రాచమర్యాదలు చేశారు. లగ్జరీ రెస్టారెంట్ లో దర్జాగా బిర్యానీ తినిపించారు. దీనిపై స్పందించిన డీజీపీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 

Also Read: ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

దాడులు, అసభ్య దూషణలు, దౌర్జన్యాలతో బోరుగడ్డ అనిల్ పై ఎన్నో కేసులు ఉన్నాయి. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. ఇక గతంలో తుళ్లూరు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు అనిల్ కుమార్ ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. ఆపై మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.

Also Read :  రేపో, మాపో కేటీఆర్ అరెస్ట్‌!

లగ్జరీ హోటల్ లో విందు

ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ సెంట్రల్ జైలు ఉన్న రాజమహేంద్రవరానికి బయల్దేరారు. ఈ మేరకు గన్నవరం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ వద్ద వాహనాన్ని ఆపారు. ఆపై అనిల్ ను అత్యంత మర్యాదగా, గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం.. ఖైదీని వాహనంలో ఉంచి మాత్రమే ఫుడ్ అందించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఏకంగా అనిల్ కు రాచమర్యాదలు చేశారు. బిర్యానీ, చికెన్ లతో భోజనం పెట్టించారు. అనిల్ తో పాటు వారూ తిన్నారు. 

Also Read :  పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

బిల్లు కూడా అనిల్ తోనే కట్టించారు. ఇదంతా మొబైల్ లో వీడియో తీస్తున్నవారిని బెదిరించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయం డీజీపీ ద్వారకా తిరుమల రావు వద్దకు చేరుకుంది.

Also Read: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన అరగంట వ్యవధిలోనే సంబంధిత పోలీసుల్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అందులో అనిల్ కు ఎస్కార్ట్ బృందంగా గుంటూరు జిల్లా ఏఆర్ కు చెందిన ఆర్ఎస్సై పి. నారాయణ రెడ్డి ఆధ్వర్యలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు, ఏఆర్ కానిస్టేబుళ్లు టి. శంకరరావు, కె.బుచ్చయ్య, తుళ్లూరు పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లు బాల ఎం.శౌరి, తాడికొండ పీఎస్ కానిస్టేబుల్ ఎస్. ఏ సద్దులా ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు