Jogi Ramesh: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ

AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు.

New Update
Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

YCP : తెలంగాణతో పాటు ఏపీలో కూడా నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ పార్టీలో ఓటమి చెందాయి. కాగా ఏపీలో మాత్రం వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అవ్వడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. కాగా పార్టీ ఓటమితో ఇప్పటికే కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరగా.. తాజాగా మరో మంత్రి కూడా వైసీపీని విడనున్నట్లు వార్తలు వచ్చాయి.

Also Read :  హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు

జోగి రమేష్ క్లారిటీ...

గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు. జగన్ మాట ప్రకారం 2019 లో సీటు త్యాగం చేసి పక్కకు వెళ్లినట్లు చెప్పారు. తమ  మోచేతి కింద నీళ్ళు తాగి, తమ జెండా కింద గెలిచి పార్టీ మారి.. జగన్ పై  కారుకూతలు కూస్తార్రా? అని ధ్వజమెత్తారు. బకాయిలన్నీ తీసుకుని జంప్ జిలానీ అన్నాడు ఎమ్మెల్యే అని విమర్శించారు.

Also Read :  కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ

తాను వైయస్ రాజశేఖరరెడ్డి శిష్యుడని అన్నారు. తన జోలికి వస్తారనుకున్నా.. తన కుటుంబంలో తన  కుమారుడిపైన కూడా కక్ష సాధింపులకు దిగుతున్నారని అన్నారు. తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అలాంటిది అడగకుండా అన్ని ఇచ్చేవాడే జగన్ అని కొనియాడారు. 

Also Read :  కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..!

ఎన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తి కాదు ఈ జోగి రమేష్ అని అన్నారు. ఈ రోజు నుండి ప్రయాణం మొదలైంది, జనవరిలో మైలవరం లో వైసీపీ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. తమకు కూటములు లేవు, జెండాలు జతకట్టాల్సిన అవసరం లేదు.. ఒక్కడే లీడర్, సింగిల్ ఎజెండా  అని స్పష్టం చేశారు. 5 నెలలు కూడా పూర్తి కాకుండానే ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతూ జనం జగన్ కోసం చూస్తున్నారని అన్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, సిద్దమేనా? అని అన్నారు.

Also Read :  వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు