BIG BREAKING: విడదల రజినికి జగన్ కీలక పదవి!

AP: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే.

New Update
Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ సమన్వయకర్తగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

Also Read: నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

vithala rajini

Also Read: TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?

జనసేనలో చేరుతారంటూ...

విడదల రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడంతో ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు ఇటీవల ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

Also Read: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!

బాలినేని సాయంతో?..

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు... ఇందులో భాగంగానే బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో విడుదల రజిని అనుచరులు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మార్పు లేదంటూ వారు చెబుతున్నారు. కాగా తాజాగా జగన్ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఇప్పటికైనా ఆ పార్టీ మార్పు ప్రచారాలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.

Also Read: మాజీ సీఎం జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్!

#jagan #vithala rajini #ap-politics
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు