BIG BREAKING: వైసీపీ సంచలన నిర్ణయం!

AP: వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు  ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ నుంచి వైసీపీ తప్పుకుందని అన్నారు.

New Update
YS Jagan

YCP: వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు  ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ నుంచి వైసీపీ తప్పుకుందని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం  హయాంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించిన అవకాశం లేదని అన్నారు. నిష్పక్షపాతంగా   ఎన్నికలు జరుగుతాయి అని నమ్మకం లేదని చెప్పారు. పోటీ చేసే అభ్యర్థి... స్వేచ్ఛగా  ఓటు అడిగే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో  లా అండ్ ఆర్డర్ ఏవిధంగా స్వయంగా పవన్ కళ్యాణ్ తన నోటి ద్వారా చెప్పారని.. ఇంకా వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా వేధిస్తున్నారో  అందరూ గమనిస్తున్నారని అన్నారు.

విజయనగరం స్థానిక సంస్థల...

ఇటీవల ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల అయింది. ప్రస్తుతం  విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి ఉంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్‌ జరగనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు