AP: ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్...

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేస్తూ... అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

author-image
By Manogna alamuru
New Update
s

AP Secretariat Joint Secretary: 

 

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేశారు.   గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేస్తూ... అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ఢిల్లీకి వెళ్లిన సమయంలో అప్పటి అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ దియో ఫిలస్‌ కు క్లీన్‌ చీట్‌ ఇస్తూ విజయరాజు డీజీపీ ఆఫీస్‌ కు లేఖ రాశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌ వైపునకు కెమెరాలు తిప్పిన వ్యవహారంలో చీఫ్‌ మార్షల్‌ పై చర్యలు తీసుకోవాలని అప్పటికే అసెంబ్లీ అధికారుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నిర్దారించింది. ఈ విషయాన్ని తొక్కిపెట్టి దియో ఫిలస్‌ కు క్లీన్‌ చీట్‌ ఇవ్వడంపై అసెంబ్లీ సెక్రటరీ సీరియస్‌ అయ్యారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు నివేదించి ఆయన అనుమతితో జాయింట్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేశారు.

https://www.teluguglobal.com/andhra-pradesh/ap-assembly-joint-secretary-suspension-1077631

Alsg Read: AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు