New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..! ఏపీలో మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ ట్రైన్ మార్గం రానుంది. By Bhavana 10 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ ఉండగా.. రాష్ట్రంలో మరో మార్గం కూడా అందుబాటులోకి రాబోతుంది. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు ఈ ట్రైన్ మార్గం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం 56.63 కిలోమీటర్ల ట్రైన్ మార్గం నిర్మించడం కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణకు తాజాగా.. రైల్వేశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్ ఇస్తానంటున్న టీసీఎస్! ఏపీలోని రాజధాని అమరావతిని ట్రైన్ మార్గం ద్వారా కనెక్ట్ చేయటానికి ఎర్రుపాలెం-నంబూరు స్టేషన్ల మధ్య అమరావతి మీదుగా కొత్తగా నిర్మిస్తున్న బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం కోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులోని 20 సర్వే నంబర్లలోని 12.59 ఎకరాలు, చిలుకూరులోని 42 సర్వే నెంబర్‌లోని 24.540 ఎకరాలు కలిపి మొత్తం 37.13 ఎకరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ శనివారం (నవంబర్ 9) నోటిఫికేషన్ జారీ చేసింది. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు ఈ భూసేకరణపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనల ఉంటే.. 30 రోజుల్లోపు విజయవాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు లిఖితపూర్వకంగా అందజేయాలని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం విచారణ చేపట్టి సదరు అధికారి జారీచేసే ఉత్తర్వులే ఫైనల్ అని స్పష్టం చేశారు. Also Read: Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో మెట్రో ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచింది. రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపైనా దృష్టి సారించింది. ఇప్పటికే విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో మెట్రో నిర్మాణం దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! విజయవాడ మెట్రో మొదటి దశలో 38.40 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగబోతుంది. గన్నవరం నుంచి PNBS వరకు 26 కిలోమీటర్ల మేరకు మొదటి కారిడార్, PNBS నుంచి పెనమలూరు వరకూ 12.5 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 21 స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ మొదటి దశలో నిర్మించాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. తొలిదశ నిర్మాణం కోసం 11 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. #indian-railway #new train line in ap #errupalem to namburu train route #amaravati train line మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి