AP News: మంచం కింద నక్కి నక్కి.. వ్యభిచార గృహంలో వైసీపీ నేత రాసలీలలు!

విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వైసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్‌నాయక్‌ను A10 గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

New Update
spa case vjwd

spa case vjwd Photograph: (spa case vjwd)

AP News: విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వేసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. యూట్యూబ్ ఛానల్ పేరుతో బోర్డ్ పెట్టి లోపల స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తుండగా పోలీసులు రైడ్స్ చేసి 23 మందిని పట్టుకున్నారు. అందులో 10 మంది నార్త్ అమ్మాయిలు, 13 మంది విటులున్నారు. అయితే ఈ పది మందిలో ఏపీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్‌ సైతం అడ్డంగా బుక్ అయ్యారు. 

Also Read:Telangana:టికెట్‌ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్‌ ట్యాక్స్‌!

నక్కి నక్కి ముఖం దాచుకుంటూ..

ఈ మేరకు వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేయగానే కొంతమంది పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. అయితే శంకర్ నాయక్ మాత్రం తప్పించుకునే వీలులేక మంచంకింద దూరిపోయాడు. అయితే రూమ్ లో పోలీసులకు ఒక మహిళ మాత్రమే కనిపించడంతో అనుమానం వచ్చి బాత్రూమ్, కబోర్డ్స్ వెతికారు.

Also Read:Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

Also Read:Anushka Sarma: కోహ్లీ సూపర్‌ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!

చివరికి అనుమానం వచ్చి బెడ్ కింద టార్చ్ లైట్ కొట్టగా శంకర్‌నాయక్‌ నక్కి నక్కి ముఖం దాచుకుంటూ కనిపించాడు. వెంటనే పోలీసులు అతన్ని చేయిపట్టి బయటకు లాగారు. అప్పటికే చెమటలు పట్టిన శంకర్ ముఖం దాచుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల రాసలీలల బాగోతం బయటపడుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అధికారులు, పోలీసులకు బెదిరింపులు..

ఇక సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకర్‌నాయక్‌.. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఫిబ్రవరి 9 వరకు శంకర్ రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. అధికారులు, పోలీసులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యభిచారం కేసులో శంకర్‌నాయక్‌ను ఏ10గా నమోదు చేశారు.

Also Read: SLBC UPDATES: టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు!

 చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు మాచవరం సీఐ ప్రకాష్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9,( స్పా)పై  సిబ్బందితో కలసి రైడ్ చేసి యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలంతా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు