BRSకు రూ.685 కోట్ల ఆదాయం.. TDP, YCP లెక్కలు చూస్తే షాక్!
దేశంలో 40 ప్రాంతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆదాయంలో 70 శాతానికి పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది.