/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
SLBC Tunnel Rescue operations Updates
SLBC UPDATES: నాగర్ కర్నూల్ SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం ఎడమకాలువ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకుని గల్లంతైన 8మంది ప్రాజెక్టు సిబ్బందిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్ లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోగా వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వారి ప్రాణాలు కాపాడేందుకు ఆదివారం తెల్లవారు జామున 3గం.ల వరకు రెస్క్యూటీమ్స్ కష్టపడింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రా రెస్క్యూ టీమ్స్ సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
2.5 మీటర్ల ఎత్తున బురద..
ఈ మేరకు ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ను రప్పించి పరీశీలించగా టన్నెల్ బోరింగ్ మెషిన్‌లో400 మీటర్ల వరకు మట్టి, ఐరన్ షీట్లు కూరుకుపోయినట్లు గుర్తించారు. టన్నెల్‌లో 2.5 మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, సొరంగంలో భారీగా ఊటనీరు ఉబికివస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3500 లీటర్ల ఊటగా వస్తుందని, దీంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి తొలగింపు ప్రక్రియను సైతం వేగవంతం చేశామని, డీవాటరింగ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం భారీ మోటార్లు అమర్చుతున్నట్లు వెల్లడించారు.
13 కి.మీ. వరకు విద్యుత్తు సరఫరా..
ఆర్మీ సిబ్బంది, కార్మికులతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. నీటిని తోడేందుకు నేవీ టీంతో రెస్క్యూటీమ్స్ సమన్వయం చేసుకుంటున్నాయి. సొరంగంలో బురద కారణంగా ఆక్సిజన్ అందడం కష్టంగా మారింది. కార్మికులు బయటకు వచ్చేందుకు మరికొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. టన్నెల్‌లో 13 కి.మీ. వరకు విద్యుత్తు సరఫరా పునరుద్దరణ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న వైసీపీ MLAలు