AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!
ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
విఫా తుపాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో బూడిద వర్షం కురిసింది. ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలా బూడిద పొడి వర్షం కురవలేదు. ఇప్పుడు ఒక్కసారిగా బూడిద పొడి వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.